గురువారం 28 మే 2020
International - Apr 28, 2020 , 12:05:38

ఇమ్రాన్ ఖాన్ స‌హ‌చ‌రుడికి కరోనా

ఇమ్రాన్ ఖాన్ స‌హ‌చ‌రుడికి కరోనా

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌ధాన స‌హాయ‌కుడికి క‌రోనా సోకింది. పాక్ ప్రభుత్వంలో కీలక వ్యక్తి, ఇమ్రాన్  ప్రధాన అనుచరుల్లో ఒకడైన సింధ్ ప్రావిన్స్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ కు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో పాక్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయ్యింది. వెంట‌నే అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కాగా పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  సింధ్ ప్రావిన్స్ లో ఇప్పటి వరకు 4,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కరోనా టెస్టులు నిర్వహించగా...  నెగెటివ్ గా తేలింది. కొన్ని రోజులు ఇమ్రాన్ కూడా స్వీయనిర్భందంలోకి వెళ్లాడు.logo