ఆదివారం 31 మే 2020
International - Mar 31, 2020 , 23:00:21

అమెరిక‌న్ సింగ‌ర్ క‌లీ షోర్ కు క‌రోనా

అమెరిక‌న్ సింగ‌ర్ క‌లీ షోర్ కు క‌రోనా

క‌రోనా మ‌హ‌మ్మారి అగ్ర‌రాజ్యాన్ని వ‌ణికిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకుంటే అమెరికాలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 1,64,359 మంది అమెరికన్లు కరోనా బారిన పడ్డారు. 3,173 మంది  మృతి చెందగా... 5,507 మంది  కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా అక్క‌డ‌ మ‌రో సెల‌బ్రిటి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.  సింగర్ కలీ షోర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్వయంగా ఆమెనే వెల్ల‌డించారు. దేశంలో దిగ్భందం ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడ్డానని వాపోయారు. మూడు వారాల పాటు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. తన పరిస్థితి బాగానే ఉందని, అయితే ప్రజలు కరోనాపై కావాల్సినంత అప్రమత్తంగా లేరని ఆమె చెప్పుకొచ్చారు.logo