మంగళవారం 26 మే 2020
International - Mar 31, 2020 , 19:51:58

క‌రోనా: యూరప్‌లో మృత్యుఘంటిక‌లు

క‌రోనా: యూరప్‌లో మృత్యుఘంటిక‌లు

కరోనా వైర‌స్  ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య 8 లక్షలు దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 39, 563 ప్రాణాల‌ను బ‌లిగొంది. యూర‌ప్ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ముఖ్యంగా ఇట‌లీ, అమెరికా, స్పెయిన్, బ్రిట‌న్‌ దేశాల్లో విల‌య‌తాండ‌వం చేస్తోంది. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్షా 65వేల మందికి పైగా క‌రోనా సోకింది. అందులో దాదాపు మ‌ర‌ణాల సంఖ్య 4వేల‌కు చేరువైతుంది. ఇంకా మ‌ర‌ణాలు భారీగానే సంభ‌విస్తున్నాయి. ఇక స్పెయిన్‌లో  క‌రాళ‌నృత్యం చేస్తోంది. కోవిడ్ బారిన ప‌డుతున్న‌వారు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కు ద‌గ్గ‌రైంది. మ‌ర‌ణాల సంఖ్య 8వేలు దాటింది. గ‌డిచిన 24గంట‌ల్లో 553 మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం అక్క‌డి ప్ర‌జ‌లను తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. అటు బ్రిట‌న్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది.  తాజాగా 381 మరణాలు సంభవించాయి. 25,150 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,789 మంది మృతి చెందారు. ఇక‌ ఇటలీలో 101,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  11,591 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్తగా మరణాలు నమోదుకాకపోవడం ఇటాలియన్లకు ఊరట కలిగిస్తోంది. 


logo