ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 01:57:54

లాలాజలంతో కరోనా పరీక్షలు

లాలాజలంతో కరోనా పరీక్షలు

  • ‘సలైవా డైరెక్ట్‌' విధానానికి ఎఫ్‌డీఏ అనుమతి
  • తక్కువ సమయంలో ఎక్కువ టెస్టులు.. ఖర్చూ తక్కువే

వాషింగ్టన్‌: కరోనా నిర్ధారణ కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న గొంతు, ముక్కు ద్వారా నమూనాల (స్వాబ్‌) సేకరణ విధానంలో (ఆర్టీ-పీసీఆర్‌ వంటి టెస్టులు) పరీక్షా ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతున్నది.నమూనాలు సేకరించేవారికి ప్రమాదమే. ఈ నేపథ్యంలో అమెరికాలోని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నిపుణులు ‘సలైవాడైరెక్ట్‌' అనే కరోనా పరీక్షల విధానాన్ని అభివృద్ధి చేశారు. లాలాజలంతో కొవిడ్‌ నిర్ధారణ జరిపే ఈ విధానానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) శనివారం అత్యవసర అనుమతులనిచ్చింది. 

ఇది ‘గేమ్‌ ఛేంజర్‌'

‘సలైవాడైరెక్ట్‌'లో రోగుల లాలాజలాన్ని పరీక్షిస్తారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పరీక్షలను చేసే వీలు ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్వాబ్‌ పరీక్షలకు సమానమైన కచ్చిత ఫలితాలు వస్తుండటంతో ‘సలైవాడైరెక్ట్‌' పరీక్షలు ‘గేమ్‌ ఛేంజర్‌' అని ఎఫ్‌డీఏ అభివర్ణించింది.


logo