గురువారం 28 మే 2020
International - May 15, 2020 , 13:17:44

వుహాన్‌లో టెస్టింగ్‌.. క్యూక‌ట్టిన జ‌నం

వుహాన్‌లో టెస్టింగ్‌.. క్యూక‌ట్టిన జ‌నం


హైద‌రాబాద్‌: చైనాలోని వుహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాయి.  76 రోజుల లాక్‌డౌన్ త‌ర్వాత మ‌ళ్లీ వుహాన్‌లో కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే.  దీంతో న‌గ‌ర జ‌నాభా మొత్తానికి ప‌రీక్ష‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాల ప్ర‌కారం క‌రోనా ప‌రీక్ష‌లు ప్రారంభించారు. వుహాన్‌లో సుమారు కోటి ప‌ది ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న‌ది.  అయితే దాదాపు ప‌ది రోజుల్లో ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ది.  ఇవాళ కొన్ని చోట్ల భారీ క్యూలైన్లు ఉన్నాయి. ప్ర‌జ‌లు క‌రోనా ప‌రీక్ష‌ల కోసం స్వ‌తంత్రంగా సెంట‌ర్ల వ‌ద్ద‌కు వ‌స్తున్నారు.  ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల కోసం ప్ర‌త్యేక టెంట్లు ఏర్పాటు చేసింది. పార్క్‌లు, రెసిడెన్షియ‌ల్ ప్రాంతాలు, కారు పార్క్‌ల వ‌ద్ద ఈ ఏర్పాట్లు చేశారు.  

ఇవాళ కొత్త‌గా చైనాలో నాలుగు కేసులు న‌మోదు అయ్యాయి. లోక‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ద్వారా అవి న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. జిలిన్ ప్రావిన్సులో ఈ కేసుల‌న్నీ రిపోర్ట్ అయ్యాయి.  షూల‌న్ సిటీలో ఇటీవ‌ల అక‌స్మాత్తుగా కేసులు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే.  అయితే ఇప్ప‌టికే 30 ల‌క్ష‌ల మందికి వుహాన్‌లో ప‌రీక్ష‌లు పూర్తి అయిన‌ట్లు అధికారులు చెప్పారు.logo