సోమవారం 01 జూన్ 2020
International - Apr 13, 2020 , 20:07:16

దక్షిణ ఆసియాలో క్రమంగా పెరుగుతోన్న కరోనా వ్యాప్తి

దక్షిణ ఆసియాలో క్రమంగా పెరుగుతోన్న కరోనా వ్యాప్తి

యూర‌ప్‌లో మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. ద‌క్షిణాసియా దేశాల్లోనూ నెమ్మ‌దిగా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇండియా, పాక్‌లో వేల‌ల్లో ఉండ‌గా...  మిగతా దేశాల్లో మాత్రం కేసులు వందల్లోనే ఉన్న‌ది. అయితే అందుకు కార‌ణం కూడా ఉన్న‌ది. ముఖ్యంగా ఇండియాలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం  తబ్లిఘి జమాత్  కారణంగా నిలిచింది. ఇక పాక్‌కు మాత్రం ఇరాన్ నుంచి వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందింది. ఇరాన్ నుంచి పాక్ కు వేలాదిమంది ప్రయాణ చరిత్ర కలిగివుండటం మూలాన అక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 

భారత్ లో మాత్రం ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ కారణంగా కేసులు పెరిగినట్టు అధికారిక ప్రభుత్వ గణాంకాలు చూస్తే అర్ధమవుతోంది. శ్రీలంక , బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్ దేశాలలో క‌రోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ భయం మాత్రం ఆవహించింది. మొత్తంగా ద‌క్ష‌ణాసియాలోని దేశాల్లో భారతదేశంలో 9,152, వాటిలో 308 మరణాలు, పాకిస్తాన్‌ 5,374,  93 మరణాలు ఉన్నాయి.. బంగ్లాదేశ్‌ 621,  34 మరణాలు, ఆఫ్ఘనిస్తాన్‌లో 607 కేసులు న‌మోదుకాగా.. 607 కేసులు ఉన్నాయి. ఇక శ్రీలంకలో 203 కేసులు, వాటిలో 7 మరణాలు ఉన్నాయి.. మాల్దీవుల్లో 20 కేసులు, కానీ ఇక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అలాగే 12 కేసులు ఉన్న నేపాల్‌,  ఐదు కేసులు ఉన్న భూటాన్‌లో కూడా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.


logo