గురువారం 04 జూన్ 2020
International - Apr 07, 2020 , 16:41:30

అమెరికా సైన్యంలో క‌రోనా క‌ల‌క‌లం

అమెరికా సైన్యంలో క‌రోనా క‌ల‌క‌లం

అగ్ర‌రాజ్యం అమెరికాను క‌రోనా వైర‌స్ గ‌జ‌గ‌జ‌లాడిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలో వైర‌స్ మరింత వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే 3ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదుకాగా, ప‌దివేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అంత‌కంత‌కూ పెరుగుతున్న కేసుల‌ను త‌గ్గించేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా అక్క‌డ ప్ర‌జ‌ల‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసుల వ‌ళ్ల కాక‌పోవ‌డంతో ఆర్మీని ప్ర‌భుత్వం రంగంలోకి దింపింది. ఈ నేప‌థ్యంలో చాలా ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఆర్మీనే కంట్రోల్ చేసింది. ఈ సమయంలో కరోనా వైరస్ ప్రజల నుంచి ఆర్మీకి వ్యాపించింది.  వెయ్యిమందికి పైగా  సైన్యానికి కరోనా సోకినట్టుగా అమెరికా అధికారులు చెప్తున్నారు.  ఇందులో 300 మంది నేషనల్ గార్డ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.logo