సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 13:29:42

బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న క‌రోనా పేషంట్‌.. పోలీసుల‌ను ముప్ప‌తిప్ప‌లు పెట్టింది!

బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న క‌రోనా పేషంట్‌.. పోలీసుల‌ను ముప్ప‌తిప్ప‌లు పెట్టింది!

లాక్‌డౌన్ ఉన్న‌న్ని రోజులు ఇంట్లోనే కూర్చోవాలి. క‌రోనా వ‌చ్చినా హోమ్ క్వారెంటైన్ ఉండాలి. ఇంకెప్పుడు ఎంజాయ్ చేసేది అని ఓ మ‌హిళ‌ విచ్చ‌ల‌విడిగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న‌ది. ఆమె ఆరోగ్యం బాగానే ఉంటే మ‌రేం ప‌ర్వాలేదు. కానీ ఆమెకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు క్వారెంటైన్‌లో ఉండ‌మ‌ని ఆదేశించారు. దానికి ఆ మ‌హిళ విరుద్ధంగా అంద‌రితో క‌లిసి బీచ్‌లో స‌ర్ఫింగ్ చేస్తుంది. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు పీపీఈ కిట్లు ధ‌రించి హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నారు.

స్పెయిన్‌లో ఇటీవ‌ల లాక్‌డౌన్ తొలిగించారు. అంద‌రినీ వ‌దిలేసినా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌వారు క్వారెంటైన్‌లో ఉంటున్నారో లేదా అని నిఘా మాత్రం ఉంచారు. ఈ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవ‌ల ఓ మ‌హిళ లాక్‌డౌన్‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించి బీచ్‌లో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న‌ది. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బోట్లో వెళ్లి మ‌రీ అడ్డుకున్నారు. అయినా ఆమె చెప్పిన మాట విన‌డం లేదు. పైగా పారిపోయేందుకు ప్ర‌య‌త్నించింది. ఆమె ప‌ప్పులేం పోలీసులు ముందు ఉడ‌క‌లేదు. ఆమె నేరుగా స్టేష‌న్‌కు తీసుకెళ్లి భారీ జ‌రిమానా విధించారు. త‌ర్వాత క్వారెంటైన్‌కు త‌ర‌లించారు. ఆమె బీచ్‌లో చేసిన హ‌ల్‌చ‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.  


logo