గురువారం 26 నవంబర్ 2020
International - Oct 24, 2020 , 18:43:53

పోలండ్ ప్రెసిడెంట్‌కు క‌రోనా పాజిటివ్‌

పోలండ్ ప్రెసిడెంట్‌కు క‌రోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న దేశాధినేత‌ల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బ్రిట‌న్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, బ్రెజిల్ అధ్య‌క్ష‌డు జైర్ బోల్సోనారో త‌దిత‌రులు క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డ‌గా.. తాజాగా ఆ జాబితాలో పోలెండ్ అధ్య‌క్షుడు ఆండ్రేజ్ దుడా చేరారు. త‌మ అధ్య‌క్షుడు ఆండ్రేజ్ దుడాకు క‌రోనా వైరస్‌ సోకిందని పోలండ్‌ విదేశాంగ శాఖ మంత్రి బ్లేజెజ్‌ స్పైచాల్‌స్కీ వెల్లడించారు. 

అయితే, ప్రస్తుతం ఆండ్రేజ్ దుడా ఆరోగ్యం నిలకడగానే ఉంద‌ని బ్లేజెజ్‌ తెలిపారు. దుడాకు వైరస్‌ ఎప్పుడు నిర్ధారణ అయ్యిందనే విషయాన్ని మాత్రం పోలండ్‌ అధికారులు పేర్కొనలేదు. ఈ మధ్యే ఆయన బల్గేరియా అధ్యక్షుడు రుమెన్‌ రాదేవ్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కాగా, కరోనా వైరస్‌ ధాటికి యూరప్‌ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం యూరప్‌ దేశాలు మరో దఫా వైరస్‌ విజృంభణను ఎదుర్కొంటున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.