బుధవారం 03 జూన్ 2020
International - Apr 30, 2020 , 12:00:40

అమెరికాలో 2 వేల మంది ఖైదీల‌కు క‌రోనా

అమెరికాలో 2 వేల మంది ఖైదీల‌కు క‌రోనా

న్యూఢిల్లీ: అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తూనే ఉన్న‌ది. బ‌య‌టి జ‌నాల్లోనేగాక వివిధ జైళ్ల‌లో ఉన్న ఖైదీల్లోనూ క‌రోనా తీవ్ర‌త పెరుగుతున్న‌ది. ఇటీవ‌ల నిర్వ‌హించిన నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో పలు జైళ్లలో ఉన్న‌ సుమారు 2 వేల మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ వెల్లడించింది. మొత్తం 2,700 మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా 2,000 మందికి పాజిటివ్ అని తేల‌డం ఆందోళ‌న‌క‌ర‌మ‌ని ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ప్రిజ‌న్స్ అధికారులు అభిప్రాయ‌పడ్డారు. 

కాగా క‌రోనా మహమ్మారి ధాటికి ఇప్పటికే ఆ దేశంలో 60 వేల మందికిపైగా మృతిచెందారు. ఇంకా ల‌క్ష‌ల మంది బాధితులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ పరిధిలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న సుమారు 1,50,000 ఖైదీల పరిస్థితిపై ప‌లువురు న్యాయవాదులు, చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బయటి కంటే జైళ్లలోనే పరిస్థితులు బాగున్నాయని ఫెడరల్‌ బ్యూరో అభిప్రాయ‌ప‌డింది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo