ఆదివారం 12 జూలై 2020
International - Jun 20, 2020 , 20:17:12

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌కు కరోనా పాజిటీవ్‌

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌కు కరోనా పాజిటీవ్‌

ఢాకా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, అధికారులు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ మొర్తాజా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. మొర్తాజా గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ శుక్రవారం కరోనా టెస్టు చేయించుకున్నాడు.

శనివారం వచ్చిన రిపోర్టులో పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. అంతకు ముందు కొన్ని గంటల క్రితమే బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ నఫీస్‌ ఇక్బాల్‌కు కూడా కరోనా పాజాటీవ్‌ రిపోర్టు వచ్చింది. కాగా ఇటీవలే కెప్టెన్సీకు గుడ్‌ బై చెప్పిన మొర్తాజా ఇంకా రిటైర్మెంట్‌ ప్రకటించలేదు.


logo