శనివారం 06 జూన్ 2020
International - May 14, 2020 , 12:37:09

బ్రెజిల్‌లో క‌రోనా మ‌రింత ఉధృతం

బ్రెజిల్‌లో క‌రోనా మ‌రింత ఉధృతం

న్యూఢిల్లీ: బ్రెజిల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు మరింత ఉధృత‌మ‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో అక్క‌డ‌ 11,385 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,88,974కు చేరింది. ఇక గ‌త 24 గంట‌ల్లో బ్రెజిల్‌లో మ‌ర‌ణాలు కూడా భారీగా న‌మోద‌య్యాయి. ఒక్క‌రోజే 749 మంది మృతిచెంద‌డంతో ఆ దేశంలో న‌మోదైన‌ మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 13,149కి చేరింది. మ‌రోవైపు కరోనా వైరస్ కార‌ణంగా బ్రెజిల్‌లో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది.

రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టంతో ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను‌ మరికొన్ని వారాలు పొడిగించాలని ఆ దేశ అధ్యక్షుడు జైర్‌‌ బోల్సోనారో నిర్ణ‌యించారు. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల గవర్నర్ల‌కు ఆదేశాలు జారీచేశారు. ఇదిలావుంటే బుధవారం బ్రెజిల్‌ ఆర్థికశాఖ ఆ దేశ ఆర్థిక పరిస్థితిని వివరించింది. బ్రెజిల్‌ ఎకానమీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని, గత వందేళ్లలో ఇంతలా క్షణించడం ఇదే మొదటిసారి ఆర్థిక‌శాఖ అధికారులు తెలిపారు. 


logo