శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 28, 2020 , 10:17:29

అమెరికాలో 10 ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు

అమెరికాలో 10 ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు

హైద‌రాబాద్‌: అమెరికాలో నోవెల్ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య ప‌ది ల‌క్ష‌లు దాటింది. న్యూయార్క్‌లో అత్య‌ధికంగా మూడు ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత స్థానంలో న్యూజెర్సీ ఉన్న‌ది.  అమెరికాలో ఎక్కువ ప్ర‌భావానికి గురైన రాష్ట్రాల్లో పెన్‌సిల్వేనియా, ఇలియ‌నాస్‌, మిచిగ‌న్‌, జార్జియా, ఫ్లోరిడా, లూసియానా, టెక్సాస్‌, కాలిఫోర్నియా కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం ఈశాన్య రాష్ట్రాల్లోనే వైర‌స్ కేసులు అధికంగా ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఇక వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 56 వేల 715గా నిలిచింది.  సుమారు ల‌క్షా 20 వేల మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. logo