శుక్రవారం 05 జూన్ 2020
International - May 13, 2020 , 18:33:02

11 రోజులుగా రోజూ 10 వేల‌కుపైగా కొత్త కేసులు

11 రోజులుగా రోజూ 10 వేల‌కుపైగా కొత్త కేసులు

 న్యూఢిల్లీ: ర‌ష్యాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త 11 రోజుల నుంచి వ‌రుస‌గా రోజూ 10 వేల‌కు పైగా కొత్త‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా కొత్త‌గా 10,029 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,271కి చేరింది. ఇక మ‌ర‌ణాల సంఖ్య కూడా ర‌ష్యాలో క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతున్న‌ది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు సంభ‌వించిన మొత్తం మర‌ణాల సంఖ్య 2,212కు చేరింది. మొత్తం కేసులు 2.5 ల‌క్ష‌ల‌కు చేరువ కావ‌డంతో ప్ర‌పంచంలో అమెరికా త‌ర్వాత అత్య‌ధిక క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన దేశంగా ర‌ష్యా నిలిచింది.        

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo