మంగళవారం 14 జూలై 2020
International - Jun 02, 2020 , 18:04:07

పాకిస్థాన్ లో 76 వేలు దాటిన కరోనా కేసులు

పాకిస్థాన్ లో 76 వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: పాకిస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ఆ దేశంలో ఇప్పటికే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76,106కు చేరింది. మరణాలు 1599కి చేరాయి. అత్యధికంగా సింధ్ రాష్ట్రంలో 31086 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ 26,240, గిల్గిత్ బాల్టిస్థాన్ 738, ఖైబర్ పక్తుంక్వా 10485, బలూచిస్థాన్ 4393 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇప్పటి వరకు 2893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్ లో నమోదైన మొత్తం కేసుల్లో 28.5 శాతం మహిళలు ఉన్నారని పాకిస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసులలో 1148 మంది 14 ఏండ్ల లోపు పిల్లలు ఉన్నారని తెలిపింది.


logo