శనివారం 30 మే 2020
International - May 11, 2020 , 13:13:07

పాకిస్థాన్‌లో 30 వేలు దాటిన క‌రోనా కేసులు

పాకిస్థాన్‌లో 30 వేలు దాటిన క‌రోనా కేసులు

న్యూడిల్లీ: పాకిస్థాన్‌లో క‌రోనా మ‌హమ్మారి ఉధృతి పెరుగుతున్న‌ది. రోజురోజుకు న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. ఆదివారం ఉద‌యం నుంంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 1476 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ దేశంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,941కి చేరింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే పంజాబ్‌లో అత్య‌ధికంగా 11,568 కేసులు న‌మోద‌య్యాయి. సింధ్ (11,480), ఖైబ‌ర్ ప‌ఖ్తుంక్వా (4,669), బ‌లూచిస్థాన్ (2,017), ఇస్లామాబాద్ (679), గిల్గిత్ బాల్టిస్థాన్ (442) వ‌రుస‌గా ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్న‌ది. సోమ‌వారం కొత్త‌గా 28 మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో పాకిస్థాన్‌లో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 667కు చేరింది.  


logo