బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 16:13:20

అమెరికాలో 27 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

అమెరికాలో 27 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌త రెండు రోజుల నుంచి రోజుకు 50 వేల చొప్పున కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గురువారం ఒక్కరోజే కొత్త‌గా 53 వేల‌కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 27 ల‌క్ష‌ల మార్కును దాటి 27,32,639కి చేరింది.

ఒక్క ఫ్లోరిడా రాష్ట్రంలోనే గురువారం 10,109 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. కాగా, ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒకేరోజు ఇన్ని కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసార‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. కాగా అమెరికాలో న‌మోదైన మొత్తం కేసుల‌లో 1,28,643 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే 20 లేదా అంత‌కంటే ఎక్కువ కేసులు న‌మోదైన కౌంటీల్లో ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్ గ్రెగ్ అబ్బాట్ ఆర్డ‌ర్ జారీచేశారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo