సోమవారం 25 మే 2020
International - Mar 29, 2020 , 19:41:18

అమెరికాలో 2000 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

అమెరికాలో 2000 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: అగ్ర‌రాజ్యం అమెరికాను క‌రోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఇప్ప‌టికే ఆ దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2000 దాటింది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అగ్ర‌రాజ్యం అమెరికాలో భారీగానే పెరుగుతున్నది. న్యూయార్క్‌, వాషింగ్ట‌న్ స‌హా దాదాపు అమెరికాలోని అన్ని రాష్ట్రాల‌కూ క‌రోనా వ్యాపించింది. ఆదివారం సాయంత్రానికి 1,24,686 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 3,397 మంది ఆ వైర‌స్  బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని, మ‌రో 1,21,289 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని అమెరికా వైద్యాధికారులు వెల్ల‌డించారు.  

కాగా, స‌రిగ్గా రెంండు నెల‌ల క్రితం అమెరికాలో తొలి కేసు న‌మోదైంది. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో వైర‌స్ శ‌ర‌వేగంగా విస్త‌రించి 2000 మందిని బ‌లితీసుకుంది. మ‌రికొన్ని రోజులు కూడా వైర‌స్ ప్ర‌భావం ఇలాగే కొన‌సాగితే త్వ‌ర‌లోనే మ‌ర‌ణాల సంఖ్య‌లో చైనా, ఇట‌లీల‌ను దాటిపోయే ప్ర‌మాదం ఉంది. ముఖ్యంగా న్యూయార్క్‌, వాషింగ్ట‌న్‌పై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఇక చికాగో, డెట్రాయిట్, న్యూ అర్లీన్స్ లో కూడా వైర‌స్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న‌ది.   


logo