శుక్రవారం 05 జూన్ 2020
International - May 11, 2020 , 11:40:51

బ్రెజిల్‌లో 1.60 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

బ్రెజిల్‌లో 1.60 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: బ్రెజిల్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజురోజుకు అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న‌ది. ఆదివారం ఒక్క‌రోజే కొత్త‌గా 6,760 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో ఆ దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62, 699కి చేరింది. ఇక మ‌ర‌ణాల సంఖ్య‌ కూడా వేగంగా పెరుగుతున్న‌ది. ఆదివారం ఒక్క‌రోజే 496 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 11,123కు చేరింది. బ్రెజిల్ ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం 1,62,699 కేసుల‌లో 61,000 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగ‌తా వారు వివిధ ఆస్ప‌త్రుల్లోని క్వారెంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.   ‌ 


logo