శుక్రవారం 10 జూలై 2020
International - Jun 27, 2020 , 12:04:41

అమెరికాలో 1.25 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

అమెరికాలో 1.25 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్రతిరోజు ప‌ది వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. నిత్యం వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య ల‌క్షా ఇర‌వై ఐదు వేల మార్కును దాటి 1,25,045కు చేరింది. జాన్ హ‌ప్కిన్స్ యూనివ‌ర్సిటీలోని రిసోర్స్ సెంట‌ర్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇక మొత్తం అమెరికాలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసులు కూడా 24 ల‌క్ష‌లు దాటాయి. 


logo