ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 24, 2020 , 06:02:08

కరోనా రెండేండ్లే.. త్వరగానే మ‌హ‌మ్మారి నుంచి విముక్తి

కరోనా రెండేండ్లే.. త్వరగానే మ‌హ‌మ్మారి నుంచి విముక్తి

జెనీవాః భూగోళాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి రెండేండ్లకు మించి ప్రభావం చూపకపోవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. స్పానిష్‌ ఫ్లూలాగా ఎక్కువకాలం ఇది ఉండకపోవచ్చని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ అదనమ్‌ టెడ్రోస్‌ గాబ్రియేసుస్‌ అభిప్రాయపడ్డారు. 

‘కరోనా వైరస్‌ రెండేండ్లలోపే అంతమైపోతుందని నమ్ముతున్నాం. 1918లో ప్రపంచాన్ని వణికించిన ప్రాణాంతక స్పానిష్‌ ఫ్లూలాగా ఎక్కువకాలం ఉండదు. ప్రపంచీకరణ వల్ల భూగోళంపై ప్రతి మూలకు సంబంధాలు ఏర్పడటంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి త్వరగా జరిగింది. నేటి ప్రపంచానికి ఇదో ప్రతికూలాంశం. అయినప్పటికీ ఇప్పుడున్న సౌకర్యాలను ఉపయోగించుకొంటే స్పానిష్‌ ఫ్లూ కంటే తక్కువ కాలంలోనే కరోనాను అంతం చేయవచ్చు’ అని పేర్కొన్నారు.   


logo