శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 21, 2020 , 09:23:06

కరోనా కొత్త వేరియంట్‌.. యూకే విమానాలపై కెనడా బ్యాన్‌

కరోనా కొత్త వేరియంట్‌.. యూకే విమానాలపై కెనడా బ్యాన్‌

టొరంటో : దక్షిణ ఇంగ్లాండ్‌లో కరోనా కొత్త రూపు దాల్చడంతో పాటు వేగంగా వ్యాపిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా పలు దేశాలు ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాలపై బ్యాన్‌ విధించాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా దేశాలు యూకే నుంచి ప్రయాణాలపై ఆంక్షలు ప్రకటించాయి. తాజాగా కెనాడా ప్రభుత్వంపై యూకే నుంచి విమానాలపై బ్యాన్‌ విధించింది. కరోనా వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని, కొత్త రకం స్ట్రెయిన్‌‌పై నియంత్రణ కోల్పోయామని, పరిస్థితి అదుపు తప్పిందని యూకే హెల్త్‌ సెక్రెటరీ మాట్‌హెన్‌కాక్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్-4 విధించింది. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ దక్షిణ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ షాపింగ్, సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇటీవలి వారాల్లో లండన్, దక్షిణ ఇంగ్లాండ్‌లో కొత్త అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, ప్రస్తుతం ఉన్న జాతుల కంటే 70శాతం ఎక్కువ వ్యాప్తి చెందగల వైరస్ కొత్త వేరియంట్ కనిపించిందని జాన్సన్ శనివారం ప్రకటించారు. అయితే ఇది మరింత ప్రాణాంతకం లేదంటే తీవ్రమైన అనారోగ్యానికి కారణమని సూచించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా యూకే నుంచి వచ్చే ప్యాసింజర్‌ విమానాలపై పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. 


logo