ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 14:36:36

యూఏఈ ప్రయాణికులకు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి : ఎయిర్‌ ఇండియా

యూఏఈ ప్రయాణికులకు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి : ఎయిర్‌ ఇండియా

న్యూ ఢిల్లీ : ఇతర దేశాల నుంచి యూఏఈ వెళ్లే 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులకు కరోనా నెగిటివ్‌ రిపోర్టు తప్పనిసరి అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. విమానంలో ప్రయాణానికి ముందు కరోనా నెగిటివ్‌ రిపోర్టు ఆన్‌లైన్‌లో సమర్పించడం తప్పనిసరి అని తెలిపింది. 

ప్రయాణీకులందరూ భారతదేశంలో ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రయోగశాల (ఐసీఎంఆర్‌) నుంచి ధృవీకరించి ముద్రిత రూపంలో చెల్లుబాటయ్యే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 96 గంటలకు మించకుండా  పీసీఆర్‌ పరీక్ష చేసి తీసుకురావాలని మర్గదర్శకాలను జారీ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo