e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home Top Slides ల్యాబ్‌ నుంచే కరోనా!

ల్యాబ్‌ నుంచే కరోనా!

ల్యాబ్‌ నుంచే కరోనా!
  • కృత్రిమంగానే వైరస్‌ సృష్టి.. వేదికగా వుహాన్‌ ల్యాబ్‌
  • ప్రాథమిక స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు చేసి ప్రయోగాలు
  • ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టును వాడుకున్న చైనా
  • రక్షణ ఏర్పాట్లు లేక వైరస్‌ లీక్‌.. ప్రపంచదేశాలు కల్లోలం
  • ఆత్మరక్షణలో పడ్డ చైనా.. నకిలీ ఆధారాల సృష్టికి యత్నాలు
  • బ్రిటన్‌, నార్వే శాస్త్రవేత్తల అధ్యయనం.. ‘డైలీ మెయిల్‌’ కథనం

కొత్త మహమ్మారుల నుంచి మానవ జాతిని రక్షించడానికి ఉద్దేశించిన సంజీవని లాంటి ప్రాజెక్టును చైనా దురుద్దేశంతో పక్కదారి పట్టించిందా? కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో కావాలనే సృష్టించి.. పెను వినాశనానికి అంకురార్పణ చేసిందా? చేస్తున్న తప్పుడు పనిని బయటపెట్టేందుకు ప్రయత్నించిన నిజాయితీ గల శాస్త్రవేత్తలను మట్టిలో కలిపేసిందా? అసలు విషయాన్ని ప్రపంచం పసిగడుతుందేమోనని కొత్త కథను రీ-క్రియేట్‌ చేసిందా? కరోనా వైరస్‌ మూలలపై చర్చ కొనసాగుతున్న సమయంలో ప్రఖ్యాత బ్రిటిష్‌ పత్రిక ‘డైలీ మెయిల్‌’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తున్నది.

లండన్‌, మే 30: కరోనా వైరస్‌ దానికదే ప్రకృతిలో సహజంగా పుట్టలేదని, ఆ వైరస్‌ను చైనానే ల్యాబ్‌లో సృష్టించిందని బ్రిటన్‌ పత్రిక ‘డైలీ మెయిల్‌’ ఆదివారం సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ ఆంగస్‌ డాల్గ్లేశ్‌, నార్వే శాస్త్రవేత్త డాక్టర్‌ బిర్గర్‌ సోరెన్సెన్‌ సంయుక్తంగా జరిపిన పరిశోధన అంశాలను వెల్లడించింది. ఈ అధ్యయనం సైన్స్‌ పత్రిక ‘క్వార్టర్లీ రివ్యూ ఆఫ్‌ బయోఫిజిక్స్‌ డిస్కవరీ’లో త్వరలో ప్రచురితం కానుంది. ఆ వివరాలు..

ఎక్కడ.. ఎలా సృష్టించారు?
చైనాలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ల్యాబ్‌లో నిర్వహిస్తున్న ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టులో భాగంగా కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు కృత్రిమంగా సృష్టించారు. దీనికోసం తమ దేశంలోనే గుహల్లో ఉండే గబ్బిలాల్లోని కరోనా వైరస్‌ ప్రాథమిక స్పైక్‌ ప్రొటీన్‌ను ఆధారంగా తీసుకున్నారు.

‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ అంటే?
‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ను మానవ పరిణామక్రమాన్ని రక్షించడానికి ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టులుగా చెబుతారు. కొత్తగా వెలుగుచూసే వైరస్‌లు భవిష్యత్‌లో ఎలా పరిణామక్రమం చెందొచ్చు? ప్రమాదాలు, నివారణ మార్గాలపై ఈ ప్రాజెక్టుల్లో భాగంగా పరిశోధిస్తారు. దీని కోసం సహజంగా పుట్టిన వైరస్‌ శక్తిని కృత్రిమంగా పెంచుతారు. అయితే, ఈ ప్రాజెక్టులతో ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వీటిపై నిషేధం విధించారు. చైనా మాత్రం వీటిని కొనసాగించింది.

ఎలా లీక్‌ అయ్యింది?
‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టులను అత్యంత కట్టుదిట్టమైన ల్యాబ్‌లలో నిర్వహించాలి. వ్యాక్సిన్ల తయారీకి వాడే బయోసేఫ్టీ లెవల్‌ 2, 3 ల్యాబ్స్‌ వీటికి సరిపోవు. అయినప్పటికీ వూహాన్‌ ల్యాబ్‌లోని బయోసేఫ్టీ లెవల్‌ 3 విభాగంలో చైనా పరిశోధకులు కరోనాను కృత్రిమంగా సృష్టించడంతో వైరస్‌ లీక్‌ అయింది. అయితే, దీన్ని చైనా అధికారులు కావాలనే లీక్‌ చేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ తప్పుడు ప్రయోగాలను వ్యతిరేకించిన ల్యాబ్‌లోని కొందరు శాస్త్రవేత్తలను చైనా అధికారులు బెదిరించారు. మాట వినని మరికొందరు కనిపించకుండాపోయారు.

తప్పుదోవ పట్టిద్దాం అనుకున్నారు
లీకైన కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం అంచనాలకు మించడంతో చైనా ఆత్మరక్షణలో పడింది. దీంతోపాటు వైరస్‌ పుట్టుకపై ప్రపంచ దేశాలు ప్రశ్నలు లేవనెత్తడం, దర్యాప్తునకు ఒత్తిడి చేయడంతో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ‘రివర్స్‌-ఇంజినీరింగ్‌ (రెట్రో ఇంజినీరింగ్‌)’ సాంకేతికతతో కరోనా వైరస్‌ సహజంగానే ఏర్పడినట్టు నకిలీ ఆధారాలను సృష్టిద్దామని చైనా అధికారులు ప్రయత్నించారు. అందుకే తమదేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడు బాధితుడిలో కనిపించిన వైరస్‌ నమూనాల సమాచారాన్ని కొంతకాలం విడుదల చేయలేదు. కొన్ని నెలల తర్వాత ఆ డేటాను విడుదల చేశారు. అయితే అది కూడా అంత నమ్మశక్యంగా లేదు.

అధ్యయనకారుల గురించి..
అంకాలజీ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిశ్‌ హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ రూపకల్పనలో విశేష కృషి చేసిన వారిలోఒకరు కాగా.. వైరాలజిస్ట్‌గా ఉన్న సోరెన్సెన్‌ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ‘బయోవాక్‌-19’ వ్యాక్సిన్‌ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు.

వైరస్‌ను కృత్రిమంగా సృష్టించారని ఎలా కనిపెట్టారు?
సహజంగా ఏర్పడిన వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్లలో ఒకటి లేదా రెండు పాజిటివ్‌ చార్జ్‌ అమైనో యాసిడ్‌లు ఉంటాయి. అత్యంత అరుదుగా మూడు ఉండొచ్చు. అయితే, కరోనా స్పైక్‌ ప్రొటీన్‌లో నాలుగు అమైనో యాసిడ్‌లు ఉన్నాయి. సాధారణ వైరస్‌ను ల్యాబ్‌లో కృత్రిమంగా తీవ్రతరం చేస్తేనే నాలుగు పాజిటివ్‌ చార్జ్‌ అమైనో యాసిడ్‌లు ఏర్పడుతాయి. ఇవి మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మామూలు వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుంది. కృత్రిమ వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని ఆధారంగా కరోనా వైరస్‌ను కృత్రిమంగా సృష్టించారని భావిస్తు న్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ల్యాబ్‌ నుంచే కరోనా!

ట్రెండింగ్‌

Advertisement