బుధవారం 03 జూన్ 2020
International - Mar 31, 2020 , 16:11:55

చైనా మాస్కులు, టెస్ట్‌ కిట్లు మాకొద్దు!

చైనా మాస్కులు, టెస్ట్‌ కిట్లు మాకొద్దు!

కరోనా ప్రపంచాన్ని నణికిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనా కూడా ఇతర దేశాలకు తనవంతుగా సాయం చేస్తున్నది. చైనా తయారు చేసిన  వైద్య పరికరాలు, ఫేస్ మాస్క్ లు, టెస్ట్ కిట్లు సరఫరా చేస్తున్నది‌. చైనా పంపిన కరోనా వైరస్ నిర్ధారణ టెస్టు కిట్లు నాసిరకంగా ఉండడంతో యూరోపియన్ దేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా పంపిన కిట్లు వాడొద్దని మొదటి సారిగా నెదర్లాండ్స్ నిర్ణయించుకుంది. డచ్ ప్రభుత్వం ఇప్పటికే చైనా పంపిన FFP2 మాస్క్ లను వాడొద్దని ప్రకటించింది. బెల్జియం, ఇటలీ, స్పెయిన్ దేశాలు మాస్కులను, వైరస్ వ్యాధి నిర్ధారణ కిట్లను తిరిగి పంపించాయి.


logo