ఆదివారం 07 జూన్ 2020
International - Apr 02, 2020 , 12:10:35

ఆరు వారాల ప‌సికందును బ‌లిగొన్న క‌రోనా

ఆరు వారాల ప‌సికందును బ‌లిగొన్న క‌రోనా

క‌రోనా.. ఈ పేరు వింటేనే గుండె గుభేల్‌మంటోంది. వుహాన్‌లో పుట్టిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల వెన్నుల్లో వ‌ణుకుపుట్టిస్తుంది. ఈ మ‌హ‌మ్మారితో వేల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. ల‌క్ష‌ల్లో బాధితులు పెరుగుతున్నారు. మొదట పెద్ద‌వ‌య‌స్కుల‌పైనే ప్ర‌భావం చూపిన క‌రోనా వైర‌స్..ఇప్పుడు అంద‌రినీ బ‌లిగొంటుంది. ప‌సికందులు, చిన్నారులు, యువ‌కులు, మ‌హిళ‌లు, పురుషులు ఇలా వ‌య‌స్సు, లింగ‌ భేదం లేకుండా అంద‌రినీ మింగేస్తుంది. ఇప్ప‌టికే పలు దేశాల్లో చిన్నారుల ప్రాణాలను హ‌రించిన క‌రోనా...తాజాగా అమెరికాలో 6వారాల ప‌సికందు క‌రోనా సోకి క‌న్నుమూసింది. పుట్టిన కొద్ది రోజుల‌కే ఆ ప‌సికందుకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆ ప‌సికందు ప్రాణాలు కోల్పోయింది. ఆ ప‌సికందు మ‌ర‌ణం త‌మ‌ను బాగా క‌లచివేసింద‌ని అధికారులు పేర్కొన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo