బుధవారం 03 జూన్ 2020
International - Apr 02, 2020 , 13:35:17

క‌రోనా మాత్ర‌మే ఒరిజిన‌ల్‌..చైనాపై నెటిజ‌న్ల సెటైర్స్‌

క‌రోనా మాత్ర‌మే ఒరిజిన‌ల్‌..చైనాపై నెటిజ‌న్ల సెటైర్స్‌

చైనాలో త‌యారైన వ‌స్తువులు ప్ర‌పంచ నలుమూల‌ల‌కు చేరుతాయి. ఏదైనా బ్రాండ్‌కు ప్ర‌త్యామ్నాయంగా చైనా.. అదే కోవ‌లో వ‌స్తువుల త‌యారుచేస్తుంది. అయితే చైనా వ‌స్తువుల్లో నాణ్య‌త త‌క్కువేన‌ని, గ్యారెంటీ ఉండ‌ద‌ని అంద‌రు భావిస్తారు.  ఈ నేప‌థ్యంలో చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల్లో విల‌య‌తాండ‌వం చేస్తోంది. ల‌క్ష‌లాది మంది క‌రోనా బాధితుల‌తో పాటు వేల ప్రాణాల‌కు బ‌లితీసుకుంది. ఈ నేప‌థ్యంలో  కొంద‌రు నెటిజ‌న్లు చైనాపై సెటైర్స్ వేస్తున్నారు. అన్నీ డూప్లికేట్ వ‌స్తువులు పంపే చైనా..క‌రోనా వైర‌స్‌ను మాత్రం ఒరిజిన‌ల్ పంపించిందంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వీడియోస్‌, పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి.  ప్రతి విషయంలో డూప్లికేట్ తయారు చేసి ఇత‌ర దేశాల‌కు పంపించే చైనా..కరోనాను మాత్రం ఎందుకు ఒరిజిన‌ల్ చేసింది. ఇది కూడా డూప్లీకేటు చేయ‌వచ్చుగా అని వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ వీడియోను చూసి నెటిజ‌న్లు న‌వ్వుకుంటున్నారు. కామెంట్స్‌, షేర్స్ చేస్తున్నారు. ఇంకా కొంద‌రైతే చైనా ఉత్పత్తులను వాడొద్దు.. వాటిని బహిష్కరించండి అంటూ సోషల్‌ మీడియాలో  ప్రచారం చేస్తున్నారు.

<p>ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి<font color="#ff0000"> ..<b> <a href="https://t.me/NamastheTelangana" target="_blank">టెలిగ్రామ్</a></b></font><b> </b>యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..<br></p>logo