సోమవారం 01 జూన్ 2020
International - May 21, 2020 , 13:44:25

నల్లజాతివారే అధికంగా మరణిస్తున్నారట

నల్లజాతివారే అధికంగా మరణిస్తున్నారట

వాషింగ్టన్: కరోనా వైరస్ తేడాలు చూడదు అంటున్నారు. కానీ అమెరికా కరోనా చావుల్లో మాత్రం నల్లజాతి వారే ఎక్కుగా ఉంటున్నారు. కారణాలు ఏవైనా ఇది కాదనలేని వాస్తవం. తెల్లవారి కన్నా నల్లవారు మూడింతలు మరణించారని ఏపీఎం రిసెర్చ్ ల్యాబ్ జరిపిన అధ్యయనంలో తెలిసింది. కలర్ ఆఫ్ కరోనా వైరస్ అనే పేరుతో ఆ నివేదికను విడుదల చేశారు. లక్షమందికి మరణాల రేటు నల్లజాతివారిదే అధికంగా ఉండడం ఇందుకు ఒక కారణం. తెల్లవారు లక్షకు 20.7 మంది, లాటినోలు 22.9 మంది, ఆసియా సంతతివారు 22.7 మది మరణించగా నల్లజాతివారు 50.3 మంది మరణించారు. మొత్తంగా చూస్తే 20 వేలమందికి పైగా నల్లజాతివారు కరోనాతో మరణించారు. నల్లజాతి జనాభాను బట్టి చూస్తే ప్రతి 2000 మందిలో ఒకరు మరణించారు. ఇక విడివిడిగా రాష్ట్రాలను గమనిస్తే కాన్సస్‌లో తెల్లవారి కన్నా ఏడురెట్లు నల్లజాతివారు మరణించారు. వాషింగ్టన్‌లో ఆరింతలు మరణించారు. ఈ పరిస్థితి తక్షణం దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని సూచిస్తున్నదని అధికారులు అంటున్నారు. మోంటానా, ఊటా, నెబ్రాస్కా వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ జాతులవారీగా కరోనా జాబితాలు ఇవ్వడం లేదు. నల్లజాతివారికి ఉపశమనం కలిగించేందుకు ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురువుతున్నదనే విమర్శలు వినవస్తున్నాయి.


logo