సోమవారం 01 జూన్ 2020
International - May 03, 2020 , 14:31:31

గల్ఫ్ దేశాల్లోనూ కరోనా కరాళ నృత్యం

గల్ఫ్ దేశాల్లోనూ కరోనా కరాళ నృత్యం

ప్రపంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టిపిడిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా బారిన ప‌డ‌గా.. రెండు ల‌క్ష‌ల‌కు పైగా ప్రాణాల‌కు బ‌లితీసుకుంది. ధ‌నిక‌, పేద దేశాల‌నే తేడాలేకుండా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. అటుగల్ఫ్ దేశాల్లోనూ కరోనా మహమ్మారి వేగంగా విస్త‌రిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌లో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య అంతంకంత‌కూ పెరుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 13,599 మందికి సోక‌గా.. 121 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక మ‌ర‌ణాలు సంఖ్య‌119కి చేరింది. కోవిడ్‌ వైరస్ ప్రభావం రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో యూఏఈ  ప్ర‌భుత్వం కరోనా టెస్టులను వేగ‌వంతం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.2 మిలియన్ల కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో కరోనాతో ఎనిమిది మంది చనిపోవడం అక్క‌డ ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఆస్పత్రులు, అవుట్ పేషెంట్ క్లినిక్‌లతో సహా రోజుకి 10వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యం దేశానికి ఉందని అధికారులు తెలిపారు.


logo