శుక్రవారం 05 జూన్ 2020
International - May 23, 2020 , 15:41:33

పాకిస్థాన్‌లో విజృంభిస్తున్న కరోనా

పాకిస్థాన్‌లో విజృంభిస్తున్న కరోనా

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. కొత్తగా శనివారం ఒక్కరోజే 1743 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పాకిస్థాన్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,437కు చేరింది. ఈ మొత్తం కేసులలో అత్యధికంగా సింధ్‌లో 20,883, పంజాబ్‌లో 18,730, ఖైబర్‌ పక్తుంఖ్వాలో 7,391, బలూచిస్థాన్‌లో 3,198, ఇస్లామాబాద్‌లో 1457, గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లో 607, పీఓకేలో 171 కేసులు నమోదయ్యాయి. వారిలో 16,653 మంది డిశ్చార్జి కాగా, 1101 మంది మృతిచెందారు. మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


logo