ఆదివారం 31 మే 2020
International - May 15, 2020 , 18:38:16

ఆఫ్ఘనిస్థాన్‌లో విజృంభిస్తున్న కరోనా

ఆఫ్ఘనిస్థాన్‌లో విజృంభిస్తున్న కరోనా

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 414 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,053కు చేరింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కాబూల్‌లో 162, హెరాత్‌లో 132 నమోదయ్యాయి. అదేవిధంగా నంగర్హార్‌లో 26 మందికి, సమంగన్‌లో 19 మందికి, కాందహార్‌లో 13 మందికి, పక్తియాలో 12 మందికి, లఘ్‌మాన్‌లో 8 మందికి, ఘాజ్నీలో ఇద్దరికి, హెల్మండ్‌లో ఒకరికి, కుందుజ్‌ ఐదుగురికి, జవ్‌జాన్‌ తొమ్మిది మందికి, ఫర్యాబ్‌లో ఆరుగురికి, జాబుల్‌లో ఐదుగురికి, పక్తికాలో నలుగురికి, కపిసాలో ఇద్దరికి, బదక్షన్‌లో ముగ్గురికి, సర్‌ ఎ పుల్‌లో ఒకరికి, దాయ్‌కుండిలో ఒకరికి, ఖోస్ట్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులలోనూ అత్యధికంగా కాబూల్‌లో 1718 మందికి, హెరాత్‌లో 1067 మందికి కరోనా వైరస్‌ సోకింది.


logo