గురువారం 28 మే 2020
International - Apr 03, 2020 , 10:01:31

డ్రాగ‌న్ కంట్రీలో మ‌ళ్లీ క‌రోనా... ఓ మ‌హిళ మృతి

డ్రాగ‌న్ కంట్రీలో మ‌ళ్లీ క‌రోనా... ఓ మ‌హిళ మృతి

చైనాలో మళ్లీ కరోనా క‌ల‌క‌లం మొద‌లైంది. గ‌త కొన్ని రోజులుగా క‌రోనా కేసులు నమోదుకాకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నడ్రాగ‌న్ కంట్రీ మళ్లీ ఉలిక్కిపడింది. కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ కరోనా బారిన పడుతున్నార‌ని స‌మాచారం. అయితే కొత్త‌గా క‌రోనా కేసులు లేక‌పోవ‌డంతో చైనాలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ని స‌డ‌లించారు. దాదాపుగా అన్ని ప్ర‌దేశాల్లో ఆంక్ష‌లు ఎత్తివేయ‌డంతో జ‌న‌జీవ‌నం సాధార‌ణ ప‌రిస్థితికి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే  హెవాన్ ప్రావిన్స్‌లోని జియా ప్రాంతంలోని ఘ‌ట‌న‌తో చైనాలో మ‌ళ్లీ క‌ల‌వ‌రం మొద‌లైంది. అక్క‌డ ఓ మ‌హిళ‌కు క‌రోనా సోక‌డంతో తక్షణ చర్యలకు దిగింది. దాదాపుగా 6 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది. కాగా ఇప్పటివరకూ చైనాలో 81,589 మందికి కరోనా సోకగా.. అందులో 3,305 మంది మరణించారు.


logo