కరోనా ఎవరెవరిపై ఎటువంటి ప్రభావం చూపిందంటే...

ఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనిక దేశాలు సైతం కుదేలయ్యాయి. కొవిడ్ కారణంగా మిల్లీనియల్స్ పై ఎటువంటి ప్రభావం చూపిందని అంశంపై స్టాండర్డ్ చార్టర్ బ్యాంకు ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఇందులో కరోనా యువతకు మేలుకొలుపు కలిగించినట్లు వెల్లడైంది. ఇదే విషయాన్ని స్టాండర్డ్ చార్టర్ బ్యాంకు తెలిపింది. భారత్ సహా 12 దేశాల్లో 12,000 మందిని సర్వే నిర్వహించారు. భారత్, సింగపూర్, హాంగ్‌కాంగ్, ఇండోనేషియా, కెన్యా, మెయిన్‌లాండ్ చైనా, మలేషియా, పాకిస్తాన్, తైవాన్, యూఏఈ, యూకే, అమెరికా దేశాల్లోని యువత పై కరోనా ప్రభావం సహా వివిధ అంశాలపై సర్వే నిర్వహించింది.
కరోనా ప్రభావం అన్ని రంగాలు, జనరేషన్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ దెబ్బతో చాలామంది సేవింగ్స్ పైన దృష్టి సారించారు. ప్రధానంగా 25 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వారి పై సర్వే నిర్వహించారు. వీరు తమ ఖర్చుల కోసం నిధులు సమకూర్చుకునేందుకు అప్పులు చేయవలసి వస్తుంది. గతంలో కంటే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది. అదే సమయంలో భవిష్యత్తు కోసం సేవింగ్స్ పైన కూడా దృష్టి సారించారు. మిల్లీనియల్స్ కరోనాను ఓ ఆర్థిక మేలుకొలుపుగా భావిస్తున్నారు. సింగపూర్‌లో ప్రతి 10 మంది మిల్లీనియల్స్‌లో ఆరుగురు ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం 18 శాతం మంది మాత్రమే .తమ పర్సనల్ ఫైనాన్షియల్ పట్ల లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సంతృప్తిగా ఉన్నారు. గత నెలలో తమ రుణాలు పెరిగాయని 27 శాతం మంది వెల్లడించారు.
అదే సమయంలో 45ఏండ్ల వయస్సు దాటిన వారిలో 15 శాతం మంది మాత్రమే చెప్పారు. అయితే లాంగ్ టర్మ్‌లో తమ ఫైనాన్షియల్ గోల్స్‌ను చేరుకుంటామని 38 శాతం మంది సింగపూర్ మిల్లీనియల్స్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. 45 ఏండ్లు పైబడిన వారిలో ఈ ధీమా 25 శాతమే ఉంది. 55ఏండ్లు పైబడిన వారిలో ఈ ధీమా దాదాపు పూర్తిగా సన్నగిల్లింది. ఫైనాన్షియల్ గోల్స్ పరంగా చూస్తే 45 శాతం మంది సింగపూర్ మిల్లీనియల్స్ రిటైర్మెంట్ కోసం, 32 శాతం మంది కారు, ఇల్లు వంటి భారీ కొనుగోళ్ల కోసం ప్లాన్ చేస్తున్నారు.
45 ఏండ్లు పైబడిన వారిలో 44 శాతం మంది రిటైర్మెంట్ కోసం, 13 శాతం మంది ఇల్లు, కారు వంటి వాటి కోసం చూస్తున్నారు. తమ ఫైనాన్షియల్ గోల్స్‌ను అందుకునేందుకు 41 శాతం మంది సింగపూర్ మిల్లీనియల్స్ తమ ఖర్చులపై ప్లాన్‌గా ముందుకు సాగుతున్నారు. 43 శాతం మంది తమ రోజువారి ఖర్చుల్లో మార్పులు చేసుకుంటున్నారు. అన్ని వయస్సుల వారిలోను కామన్‌గా ఆదాయం లేక అనిశ్చితి కనిపించినట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
- కంటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు తెలుసా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- ఇంటికైనా మట్టికైనా మనోడే ఉండాలి
- రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు
- బాలికపై బ్యాంకు మేనేజర్ అత్యాచారం..!
- ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్