శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 19, 2020 , 01:40:09

చిన్నారుల్లో పెరుగుతున్న బాధితులు

చిన్నారుల్లో పెరుగుతున్న బాధితులు

  • 1.8 లక్షల మేర ఉండవచ్చన్న అధ్యయనం

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 18: కరోనా వైరస్‌ బారిన పడుతున్న పిల్లల సంఖ్య ప్రస్తుతం వెల్లడవుతున్న దానికన్నా చాలా అధికంగా ఉండవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ సంఖ్య దాదాపు 1.8 లక్షల మేర ఉండవచ్చని ఒక అధ్యయనం వెల్లడించింది. ‘పబ్లిక్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్రాక్టీస్‌' మ్యాగజైన్‌లో దీని వివరాలను ప్రచురించారు. దీని ప్రకారం.. కరోనా సోకిన ప్రతీ 2,381 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఐసీయూలో చికిత్స పొందే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ మధ్య చైనా, అమెరికా తదితర దేశాల్లో పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లలో చికిత్స నిమిత్తం చేరిన పిల్లల సంఖ్యను ఈ పరిశోధకులు పరిశీలించారు. వీరి అధ్యయనం ప్రకారం కరోనా సోకిన బాలల్లో రెండేండ్లలోపు చిన్నారులు 30 శాతం, రెండు నుంచి 11 ఏండ్లవారు 24 శాతం, 12-17 మధ్య వయసువారు 46 శాతం మంది ఉన్నారు. ఈ ఏడాది చివరికల్లా అమెరికా జనాభాలో 25 శాతం కరోనాకు గురైనపక్షంలో వారిలో 50వేల మంది పిల్లలు ఉండే అవకాశం ఉంది.


logo