శనివారం 06 జూన్ 2020
International - Apr 09, 2020 , 19:28:04

కరోనా క‌చ్చిత సమాచారం దొరుకుతుందిక్క‌డ‌

కరోనా క‌చ్చిత సమాచారం దొరుకుతుందిక్క‌డ‌

క‌రోనా వైర‌స్ వ్యాప్తి మొద‌లై 100 రోజులైంది. ప్ర‌భుత్వాలు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ క‌రోనా వైర‌స్‌పై ఎన్నో సందేహాలున్నాయి. వాటి గురించి పూర్తిగా తెల‌ప‌డానికి భార‌తీయ సైంటిస్టులే ప్ర‌త్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 

క‌రోనాపై క‌చ్చిత స‌మాచారం ఇవ్వ‌డానికి భారతీయ సైంటిస్టులు ఓ వెబ్‌సైట్ ప్రారంభించారు. అదే కొవిడ్ జ్ఞాన్ (https://covid-gyan.in/). ఈ వెబ్‌సైట్‌లో కరోనా వైరస్‌‌పై శాస్త్రీయమైన, నమ్మదగిన, కచ్చితమైన సమాచారం లభిస్తుంది. భారత్‌లోని ప్రముఖ శాస్త్ర విజ్ఞాన సంస్థలు అన్నీ కలిసి దీన్ని నిర్మాణానికి సిద్ధపడ్డాయి. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, టాటా మెమోరియల్‌ సెంటర్‌ కలిసి ఈ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాయి. ఈ వెబ్‌సైట్‌లో మీకు కరోనా వైరస్‌, కొవిడ్‌లకు సంబంధించిన పూర్తి శాస్త్రీయ సమాచారం లభిస్తుంది. ఫొటోలు, డేటా, వీడియోలూ ఉంటాయి. ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా ఈజీగా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కరోనా వైరస్‌కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఉన్న వెబ్‌సైట్ల సమాచారం కూడా ఇచ్చారు. వైరస్ ప్రస్తుత పరిస్థితేంటి, ఎలా వ్యాపిస్తోంది. వంటి విషయాల్ని ఎప్పటికప్పుడు ఇందులో షేర్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు.  ఈ సైట్ ద్వారా వాస్తవాలు తెలుసుకోవచ్చు.


logo