ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Jul 19, 2020 , 08:10:14

ఇరాన్‌లో రెండున్నర కోట్ల మందికి కరోనా.!

ఇరాన్‌లో రెండున్నర కోట్ల మందికి కరోనా.!

టెహ్రాన్‌ : ఇరాన్‌లో రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్‌ సోకి ఉండవవచ్చని ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ అన్నారు. కరోనా మహమ్మరి వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆరోగ్య శాఖా చేసిన అధ్యాయనంలో ఊహించని సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయని అన్నారు. అయితే వేటి ఆధారంగా అధ్యాయంనం చేశారో బహిర్గతం చేయలేదు. రాబోయే నెలలో ౩ కోట్ల మందికి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని రౌహానీ అంచనా వేశారు. 

ఇదిలా ఉంటే.. ఇరాన్‌లో గడిచిన 24గంటల్లో 2,166 కరోనా కేసులు నమోదు కాగా.. 188 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,70,000కు చేరింది. మొత్తం 13,973 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కేసులు పెరుగుతుండడంతో ఇరాన్‌ రాజధాని టెహ్రన్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలు మొదలైయ్యాయి. వ్యానిజ్య, వ్యాపార సముదాయాలను మూసివేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo