మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 12, 2020 , 16:58:53

టోక్యోలో 80శాతం 30 ఏండ్ల లోపు యువతకు కరోనా

టోక్యోలో 80శాతం 30 ఏండ్ల లోపు యువతకు కరోనా

టోక్యో : జపాన్ రాజధాని టోక్యోలో తాజాగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజు సుమారు 200కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత కేసుల పెరుగుదల మొదలైంది. ఫలితంగా టోక్యో నగరం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే టోక్యోలో వైరస్‌ వ్యాప్తి చెందిన వారిలో 80శాతం 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే ఉన్నారని క్యోడో వార్తా సంస్థ తెలిపింది. నైట్‌క్లబ్‌లతో 48 కేసులు వచ్చినట్లు తెలిపారు. 

టోక్యో నగరంలో ఇప్పటివరకు 7,721 కరోనాకేసులు నమోదు కాగా మొత్తం 325 మంది మరణించినట్లు తెలిసింది. అక్కడ రెండు సైనిక స్థావరాలను లాక్‌డౌన్‌ కింద ఉంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo