శనివారం 30 మే 2020
International - Apr 29, 2020 , 19:36:04

అమెరికా నావికాదళంలో 64మందికి కరోనా

అమెరికా నావికాదళంలో 64మందికి కరోనా

అమెరికాలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌పంచంలోనే క‌రోనాతో అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు అమెరికాలోనే సంభ‌వించాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డి  రక్షణ రంగంలో 64 మందికి కరోనా సోకింది. అమెరికా యుద్ధ నౌక యూఎస్ నేవీ డిస్ట్రాయర్ కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలోని నావికాదళ స్థావరానికి చేరింది. అందులో కొంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 64 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అందులో పని చేస్తున్న 300 మంది సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఆ యుద్ధ నౌకను శానిటైజ్ చేయించి నేవీ ఉద్యోగులను ఐసోలేషన్ గదుల్లోకి పంపించామని అమెరికా నావికాదళం చెప్పింది. ఇటీవల అమెరికా విమాన వాహకనౌకలో కూడా కొంత మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు నావికాదళ సిబ్బందిలో 64 మందికి కరోనా సోకడం ఆందోళనకు గురిచేస్తుంది.


logo