బుధవారం 03 జూన్ 2020
International - Apr 06, 2020 , 13:27:04

బ్రిటన్ ప్రధానికి తగ్గని కరోనా లక్షణాలు

బ్రిటన్ ప్రధానికి తగ్గని కరోనా లక్షణాలు

బ్రిటన్ ప్రధానికి తగ్గని కరోనా లక్షణాలు

గత నెలలో కరోనా వైరస్ లక్షణాలు సోకిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌లో ఆ వైరస్ వ్యాధి లక్షణాలు తగ్గలేదు. దీంతో ఆయన‌ను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 

మార్చి 27న బోరిస్‌లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో బోరిస్ జాన్స‌న్‌ గత పది రోజులుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ... ఆయనకు వారం రోజులుగా వైరస్ లక్షణాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ప్రధాని ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని ప్రధాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏడు రోజులు పూర్తయినా తనలో ఇంకా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారని, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారని బోరిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైరస్ లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉంటానని వివరించారు. ల‌క్ష‌ణాలు క‌నిపించిన వారు వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.



logo