బుధవారం 03 జూన్ 2020
International - Apr 04, 2020 , 14:42:37

క‌రోనా: ప్ర‌తి రెండున్న‌ర నిమిషాల‌కు ఒక మ‌ర‌ణం

క‌రోనా: ప్ర‌తి రెండున్న‌ర నిమిషాల‌కు ఒక మ‌ర‌ణం

న్యూయార్క్‌: క‌రోనా దెబ్బ‌కు అగ్ర‌రాజ్యం అమెరికా చిగురుటాకుల వ‌ణికిపోతుంది. ఇప్ప‌టికే అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య 2ల‌క్ష‌ల 50వేలు దాటింది. మ‌ర‌ణాలు 8వేల‌కు చేరువ‌య్యాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 60వేల ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ మ‌హ‌మ్మారి.. అమెరికాలో నిన్న ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు. ఎంత‌లా అంటే న్యూయార్క్‌లో ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఒక వ్య‌క్తి చనిపోతున్నాడు. అయితే అక్కడ పేషంట్లకు సరిపోయేన్ని వెంటిలేటర్లు లేకపోవడమే ప్రధాన కారణమని అక్క‌డి అధికారులు చెపుతున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లోనే కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య అత్యధికంగా నమోదైందని పేర్కోంటున్నారు.


logo