గురువారం 04 జూన్ 2020
International - Apr 28, 2020 , 12:32:45

క‌రోనా ఎఫెక్ట్: ప‌డిపోతున్న ట్రంప్ గ్రాఫ్

క‌రోనా ఎఫెక్ట్: ప‌డిపోతున్న ట్రంప్ గ్రాఫ్

వాషింగ్ట‌న్‌: అమెరికాలో క‌రోనా ఎఫెక్ట్‌ ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర‌ప్ర‌భావాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, వేల సంఖ్యలో మరణాలు ట్రంప్ పదవికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న గ్రాఫ్ క్రమక్ర‌మంగా పడిపోతోంది. ఇదే స‌మ‌యంలో ఈ ఏడాది చివర్లో  జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి  జో బైడెన్‌కు మద్దతు పెరుగుతోంది. క‌రోనా క‌ట్ట‌డిలో ట్రంప్ ప‌నితీరుపై స‌ర్వ‌త్రా విమర్శ‌లు ఎద‌ర‌వుతున్నాయి. అక్క‌డ‌ తాజాగా నిర్వహించిన నేషనల్‌ పోల్‌లో  ట్రంప్‌ కంటే బైడెన్‌  ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యం చూపారు. దాంతో, ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ‘యూఎస్‌ఏ టుడే- సఫ్లోక్ యూనివర్సిటీ పోల్‌’లో పాల్గొన్న వారిలో 42 శాతం మంది అమెరికా మాజీ ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు ఓటు వేయ‌గా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ వైపు 38 శాతం మంది మొగ్గు చూపారు. అయితే బ‌ల‌మైన నాయ‌కుడిగా మాత్రం ఇద్ద‌రిని ప్ర‌జ‌లు ప‌రిగ‌ణించ‌డం లేద‌ని తేలింది.logo