గురువారం 28 మే 2020
International - Apr 01, 2020 , 07:45:25

క‌రోనా ఎఫెక్ట్ ; క్వారెంటైన్‌లో ఫుట్‌బాల్ ఆడిన తాబేలు : వైర‌ల్‌

క‌రోనా ఎఫెక్ట్ ; క్వారెంటైన్‌లో ఫుట్‌బాల్ ఆడిన తాబేలు : వైర‌ల్‌

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచవ్యాప్తంగా అనేక క్రీడాక్ర‌మాల‌ను నిలిపేశారు. టోక్యో ఒలింపిక్స్‌, ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌, ఛాంపియ‌న్ లీగ్ వాయిదా ప‌డ్డాయి. ఈ స‌మ‌యంలో ఆ లోటు తీర్చ‌డానికి వ‌చ్చేసింది తాబేలు. అన్నింటికంటే చిన్నగా న‌డిచే తాబేలు ఫుట్‌బాల్ ఆడుతూ అందిరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది. ఇప్ప‌డీ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. 25 సెకెన్ల‌పాటు న‌డిచే ఈ వీడియోకు వేల‌ల్లో లైకులు వ‌స్తున్నాయి. గార్డెన్‌లో ఫుట్‌బాల్ ఉంటుంది. దీని ద‌గ్గ‌ర‌కు తాబేలు వ‌చ్చి ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటుంది. ఈ తాబేలు పేరు హ‌రికేన్‌. పాట్రిక్ ఓట్లీ-ఓకాన‌ర్ వీడియోను ట్విట‌ర్‌లో పంచుకున్నాడు.

లాక్‌డౌన్ కార‌ణంతో అత‌ను ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాడు. దాంతో రోజూ ఆ గార్డెన్‌లోకి వెళ్లి ఆడుకునేవాడు. అప్ప‌డు ఆ తాబేలు కూడా అత‌నికి తోడుగా ఉంటుంది. ఒక‌రోజు అత‌ను లేని స‌మ‌యంలో తాబేలు ఫుట్‌బాల్ ఆడ‌టం చూసి అత‌నికి  ముచ్చ‌టేసింది. వెంట‌నే కెమెరాలో బందించేశాడు.logo