సోమవారం 30 మార్చి 2020
International - Mar 20, 2020 , 06:57:06

కరోనా ఎఫెక్ట్: సర్వీసులు నిలిపివేసిన‘స్పైస్‌జెట్‌'

కరోనా ఎఫెక్ట్: సర్వీసులు నిలిపివేసిన‘స్పైస్‌జెట్‌'

ఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనూహ్య పరిస్థితి నెలకొనడంతో ‘స్పైస్‌జెట్‌' విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ అనూహ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శనివారం (ఈ నెల 21) నుంచి ఏప్రిల్‌ 30 వరకు తమ అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ‘స్పైస్‌జెట్‌' ప్రకటించింది. పరిస్థితులు సాధారణస్థాయికి చేరుకున్నాక సాధ్యమైనంత త్వరగా ఆ సర్వీసులను పునఃప్రారంభిస్తామని తెలిపింది. 

అయితే కోల్‌కతా-ఢాకా ఫ్లైట్‌ షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తుందని, చెన్నై-కొలంబో ఫ్లైట్‌ ఈ నెల 25 నుంచి, ఢిల్లీ-దుబాయ్‌, ముంబై-దుబాయ్‌ సర్వీసులు ఏప్రిల్‌ 16 నుంచి పునఃప్రారంభమవుతాయని ‘స్పైస్‌జెట్‌' అధికార ప్రతినిధి వివరించారు. భారత్‌ సహా పలు దేశాలపై కరోనా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు పెద్ద విమానయాన సంస్థలు ఇప్పటికే తమ సర్వీసులను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. 


logo