శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 14:12:12

కరోనా ఎఫెక్ట్‌.. 10శాతం సిబ్బందిని తగ్గించనున్న ఇండిగో

కరోనా ఎఫెక్ట్‌.. 10శాతం సిబ్బందిని తగ్గించనున్న ఇండిగో

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు గాను విధించిన లాక్‌డౌన్‌లో దాదాపు అన్ని వ్యాపారాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్‌ ఇప్పుడు విమానయాన సంస్థలపై కూడా పడింది. తాజాగా  ఆదాయంలో తిరోగమనం కారణంగా 10శాతం సిబ్బందిని తొలగించనున్నట్లు దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఒకటి ప్రకటన విడుదల చేసింది. 

గత నెలలో ఇండిగో 40 బిలియన్లు (సుమారు రూ.29 లక్షల కోట్లు) పైనే ఖర్చులను తగ్గించనున్నట్లు తెలిపింది. కరోనావైరస్ నేపథ్యంలో ప్రయాణంలో పరిమితులు విధించిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇండిగో యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోనోజోయ్ దత్తా పెట్టుబడిదారులకు రాసిన లేఖ ప్రకారం  "మా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి, మా కంపెనీ కొన్ని త్యాగాలను చేయాల్సి వస్తుంది. ఈ ఆర్థిక తుఫాను నుంచి బయట పడటానికి మేము ఇలా  చేయక తప్పడం లేదు’’ అన్నారు. భారతదేశం కఠినమైన లాక్‌డౌన్‌ విధించినందున చాలా నెలలుగా ఖాళీగా ఉంటున్న ఈ ఎయిర్‌ లైన్‌ సుమారు 24,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అంటే అందులో 2,400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. 

కంపెనీ సొంత గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి 48.9% మార్కెట్ వాటా కలిగిన భారతదేశపు అతిపెద్ద ప్రయాణీకుల విమానయాన సంస్థ, వరుసగా 10 సంవత్సరాలు లాభదాయకంగా ఉంది. కరోనావైరస్ సంబంధిత ఖర్చు, ఆదా చర్యల్లో  భాగంగా కూడా విమానయాన సంస్థలు తాము నడుపుతున్న విమానాలను దాదాపు తగ్గించేశాయి. గత వారం బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన 747 విమానాల మొత్తాన్ని విరమించుకుంటామని ప్రకటించింది.

ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ (ఐఏజీ) ) యాజమాన్యంలోని బీఏ విమానాలన్నింటిని తక్షణమే నిలిపివేసినట్లు తెలియజేశాయి. కనీసం 2023 వరకు మోజావే ఎడారిలో తన ఏ౩80 సూపర్ జంబోస్ సముదాయాన్ని నిల్వ చేస్తామని, 6000 మంది ఉద్యోగులను తగ్గిస్తున్నామని క్వాంటాస్ తెలిపింది. మరో 15,000 మంది సిబ్బంది ఈ సంవత్సరం చివరి వరకు ఉంటారని పేర్కొంది.  గత వారం ఎయిర్‌లైన్స్‌ అధికారికంగా న్యూజిలాండ్ కాకుండా అంతర్జాతీయ విమానాలను తన వెబ్‌సైట్ నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు తొలగించింది.logo