బుధవారం 03 జూన్ 2020
International - Apr 15, 2020 , 20:00:43

క‌రోనా ఎఫెక్ట్‌: రఫేల్‌ యుద్ధ విమానాల రాక‌ ఆలస్యం

క‌రోనా ఎఫెక్ట్‌: రఫేల్‌ యుద్ధ విమానాల రాక‌ ఆలస్యం

లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో  రఫేల్‌ యుద్ధవిమానాల రాక మరికొన్ని వారాలపాటు ఆలస్యం కానుంది. రఫేల్ యుద్ధ విమానాల  కోసం.. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తొలుత కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం.. ఈ ఏడాది మే నెల చివరినాటికి రావాల్సి ఉండ‌గా... లాక్‌డౌన్ కారణంగా ఈ యుద్ధ విమానాల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానుందని భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాతే.. రఫేల్ యుద్ధ విమానాల రాకకు సంబంధించిన తేదీలపై స్పష్టత వస్తుందని… అధికారులు తెలిపారు. అటు ప్రాన్స్‌లోనూ క‌రోనా కేసుల సంఖ్య భారీగా ఉంది. మ‌ర‌ణాలు వేల‌ల్లో చోటుచేసుకున్నాయి. కాగా  ఫ్రాన్స్‌కు చెందిన ఈ రఫేల్ జెట్ యుద్ధ విమానాలు.. అత్యాధునిక టెక్నాలజీ కలిగినవి. ఈ యుద్ధ విమానాలు రాడర్‌లను కూడా తప్పించుకుని.. అత్యంత వేగంగా దూసుకెళ్లగలవు. అయితే ఈ యుద్ధ విమానాలకు సంబంధించి..డస్సల్ట్ ఏవియేషన్ సంస్థ.. భారత పైలట్లకు శిక్షణ ఇస్తోంది. 


logo