సోమవారం 01 జూన్ 2020
International - Apr 17, 2020 , 16:46:26

క‌రోనా ఎఫెక్ట్: బ్రిట‌న్ రాణి మ‌న‌వ‌రాలు పెళ్లి వాయిదా

క‌రోనా ఎఫెక్ట్:  బ్రిట‌న్ రాణి మ‌న‌వ‌రాలు పెళ్లి వాయిదా

లండ‌న్‌: క‌రోనా సెగ బ్రిట‌న్ రాచ‌కుటుంబంపై ప‌డింది. ఇప్ప‌టికే రాచ‌కుటుంబ‌లో ప్రిన్స్ చార్లెస్‌కు క‌రోనా సోకి.. చికిత్స అనంత‌రం దాన్నుంచి కోలుకోగా...తాజాగా క‌రోనా ఎఫెక్ట్ వారింట్లో జ‌రిగే వేడుక‌పై ప‌డింది. బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ మ‌న‌వ‌రాలు పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా..క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో వాయిదా ప‌డినట్లు సమాచారం. యువ‌రాణి బియ‌ట్రైస్‌-ఎడోయార్డో  పెళ్లి వ‌చ్చేనెల‌లో జ‌ర‌గాల్సి ఉండ‌గా నిర‌వ‌ధికంగా వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. ఇదివ‌ర‌కే ఒక‌సారి వాయిదా ప‌డిని ఈ మ్యారేజ్ మ‌రోసారి కూడా వాయిదా వేశారని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా  ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగాక ఈ పెళ్లి గురించి ఆలోచించే అవ‌కాశ‌ముంటుంద‌ని తెలిపాయి. అయితే ఈ పెళ్లి గురించి మాత్రం రాచ‌కుటుంబ వ‌ర్గాలు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాగా బ్రిట‌న్‌లో ల‌క్ష‌కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 13 వేల‌కుపైగా మ‌ర‌ణాలు సంభవించాయి.logo