శనివారం 30 మే 2020
International - Apr 08, 2020 , 06:45:49

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 82,026

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 82,026

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరించింది. ఈ వైరస్‌ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 14,30,941 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 82,026 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి నుంచి 3,01,970 మంది కోలుకున్నారు. ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. బ్రెజిల్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ సహా పలు దేశాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 

అమెరికాలో 12,841 మంది, స్పెయిన్‌లో 14,045, ఇటలీలో 17,127, ఫ్రాన్స్‌లో 10,328, జర్మనీలో 2,016, ఇరాన్‌లో 3,872, యూకేలో 6,159, టర్కీలో 725, స్విట్జర్లాండ్‌లో 821, బెల్జియంలో 2,035, నెదర్లాండ్స్‌లో 2,101 మంది మృతి చెందారు. 

యూఎస్‌ఏలో 4,00,335 పాజిటివ్‌ కేసులు, స్పెయిన్‌లో 1,41,942, ఇటలీలో 1,35,586, ఫ్రాన్స్‌లో 1,09,069, జర్మనీలో 1,07,663, ఇరాన్‌లో 62,589, యూకేలో 55,242, టర్కీలో 34,109, స్విట్జర్లాండ్‌లో 22,253, బెల్జియంలో 22,194, నెదర్లాండ్స్‌లో 19,580, కెనడాలో 17,897 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.


logo