మంగళవారం 24 నవంబర్ 2020
International - Oct 24, 2020 , 17:37:57

యూర‌ప్‌లో భారీగా క‌రోనా మ‌ర‌ణాలు

యూర‌ప్‌లో భారీగా క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: లాటిన్ అమెరికా తర్వాత ప్ర‌పంచంలో అత్యధిక కొవిడ్ మరణాలు నమోదైన ఖండంగా యూరప్ రికార్డుల్లో నిలిచింది. శ‌నివారం ఉద‌యానికి అక్కడ క‌రోనా మరణాల సంఖ్య 2.50 లక్షలకు చేరుకుంది. గత రెండు వారాలుగా యూర‌ప్‌లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య విప‌రీతంగా పెరిగింది. యూర‌ప్‌లో న‌మోద‌వుతున్న అత్య‌ధిక మ‌ర‌ణాలు దక్షిణ యూరోపియన్ దేశాల్లోనే రికార్డ‌వుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో దాదాపు 19 శాతం యూర‌ప్‌లో ఉంటుండ‌గా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల్లో 22 శాతం యూర‌ప్‌కు చెందిన‌వే ఉంటున్నాయి. యూరప్ వ్యాప్తంగా నమోదైన 2.50 లక్షల మరణాల్లో యూకే, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, బెల్జియం, స్పెయిన్‌లలో మూడింట రెండొంతుల కేసులు నమోదవుతున్నాయి. 45 వేల మరణాలతో యూకే అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.