శనివారం 30 మే 2020
International - May 02, 2020 , 07:21:16

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 2,39,586

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 2,39,586

హైదరాబాద్‌ : ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్‌ దాడి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 2,39,586 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 33.98 లక్షలకు చేరుకుంది. ఈ వైరస్‌ నుంచి కోలుకుని 10.80 లక్షల మందికి పైగా డిశ్చార్జి అయ్యారు. 

యూఎస్‌ఏలో 65,766 మంది, స్పెయిన్‌లో 24,824, ఇటలీలో 28,236, యూకేలో 27,510, ఫ్రాన్స్‌లో 24,594, జర్మనీలో 6,736, టర్కీలో 3,258, రష్యాలో 1,169, ఇరాన్‌లో 6,091, బ్రెజిల్‌లో 6,410, చైనాలో 4,633, కెనడాలో 3,391, బెల్జియంలో 7,703, నెదర్లాండ్స్‌లో 4,893, ఇండియాలో 1,223, స్విట్జర్లాండ్‌లో 1,754 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo