ఆదివారం 31 మే 2020
International - Apr 24, 2020 , 07:14:22

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 1,90,635

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 1,90,635

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27.15 లక్షలకు పైగా చేరుకుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 83 వేలకు పైగా కేసులు నమోదు కాగా, 6,300 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,90,635 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 7,45,500 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

కరోనా వైరస్‌ బారిన పడి.. యూఎస్‌ఏలో 49,845, ఇటలీలో 25,549, స్పెయిన్‌లో 22,157, ఫ్రాన్స్‌లో 21,856, యూకేలో 18,738, జర్మనీలో 5,575, టర్కీలో 2,491, ఇరాన్‌లో 5,481, బ్రెజిల్‌లో 3,313, బెల్జియంలో 6,490, కెనడాలో 2,147, నెదర్లాండ్స్‌లో 4,177, స్విట్జర్లాండ్‌లో 1,549, ఇండియాలో 721 మంది చనిపోయారు. 


logo